“మంజుమ్మల్ బాయ్స్” ఓటిటి రిలీజ్ పై హాట్ స్టార్ క్లారిటీ

“మంజుమ్మల్ బాయ్స్” ఓటిటి రిలీజ్ పై హాట్ స్టార్ క్లారిటీ

Published on Apr 21, 2024 10:10 AM IST

ఇటీవల మళయాళ సినిమా నుంచి వచ్చిన లేటెస్ట్ సెన్సేషనల్ హిట్ చిత్రాల్లో అక్కడ నయా ఇండస్ట్రీ హిట్ చిత్రం “మంజుమ్మల్ బాయ్స్” కూడా ఒకటి. సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ బాసి, బాలు వర్గీస్, గణపతి ఎస్ పొదువల్, జీన్ పాల్ లాల్ తదితర నటుల కలయికలో దర్శకుడు చిదంబరం తెరకెక్కించిన ఈ సాలిడ్ ఎమోషనల్ అండ్ సర్వైవల్ డ్రామా తెలుగులో కూడా మంచి రన్ తో వెళ్తుంది.

అయితే ఈ చిత్రం ఓటిటి రిలీజ్ కోసం కూడా చాలా మంది గత కొన్ని రోజులు నుంచి ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఓటిటి హక్కులు డిస్నీ + హాట్ స్టార్ వారు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అందులో ఈ చిత్రం ఈ మే 3 నుంచి వస్తుంది అని బజ్ వచ్చింది. కానీ దీనిపై లేటెస్ట్ గా క్లారిటీ ఇచ్చారు హాట్ స్టార్ వారు.

మంజుమ్మల్ బాయ్స్ ఓటిటి రిలీజ్ ని అయితే కన్ఫర్మ్ చేశారు కానీ మే 3నే రిలీజ్ అన్నట్టుగా ఎక్కడా రివీల్ చేయలేదు. సో మే 3 రిలీజ్ కోసం చూస్తున్నవారికి ప్రస్తుతానికి అందులో ఎలాంటి నిజం లేదని గుర్తించాలి. ఇక అధికారిక డేట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు