అక్కినేని హీరో పక్కన ఆమె సెట్ అవుతుందా?

Published on Feb 21, 2020 11:01 am IST

అక్కినేని హీరో అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చి దాదాపు ఐదేళ్లు అవుతుంది. ఆయన ఇప్పటికి మూడు సినిమాలలో నటించాడు. అయితే ఈ యంగ్ హీరోకి మంచి బ్రేక్ అయితే రాలేదు. ఎన్నో ఆశల మధ్య విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన హలో కూడా ఆయన విజయ దాహం తీర్చలేదు. తన నాలుగవ ప్రయత్నంగా బొమ్మరిల్లు దర్శకుడు భాస్కర్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ అంటూ వస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల కాగా మంచి ఆదరణ దక్కించుకుంది.

ఐతే ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజ హెగ్డే ని తీసుకున్నారు. పూజ ఇప్పటికే ఎన్టీఆర్, మహేష్, బన్నీ వంటి స్టార్ హీరోలతో జత కట్టింది. ఈ నేపథ్యంలో పూజ అఖిల్ పక్కన సెట్ అవుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. సీనియర్ హీరోల పక్కన కనిపించిన పూజ, అఖిల్ సరసన కొంచెం పెద్ద అమ్మాయిగా కనిపించే అవకాశం కలదని ఇండస్ట్రీ టాక్. మరి సినిమా విడుదల ఐతే గాని తెలియదు వీరి ఫెయిర్ ఎలా ఉంటుందో. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంగీతం గోపి సుందర్ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More