రాహుల్ రవీంద్రన్, చాందినీ చౌదరి జంటగా వస్తున్న చిత్రం ‘హౌరా బ్రిడ్జ్’. ‘బూచమ్మ బూచోడు’ సినిమాకు దర్శకత్వం వహించిన రేవన్ యాదు ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌తో బిజీగా ఉంది. రేపు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ గా చెయ్యబోతున్నారు చిత్ర యూనిట్.
ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా తెరకెక్కింది. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను ఎమ్.వి.ఈ స్టూడియోస్ ప్రై.లిమిటెడ్ నిర్మిస్తోంది. ఇటీవల విడుదల చేసిన టీజర్ కు మంచి స్పందన లబించింది. ఈ సినిమా తరువాత రాహుల్ రవీంద్రన్ నటించిన ‘దృష్టి’ చిత్రం కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.
