హృతిక్ సవాల్ ను స్వీకరించిన శృతి హాసన్.

hruthik-chaleng
బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్, తన కొత్త సినిమా ‘బ్యాంగ్ బ్యాంగ్’ ప్రమోషన్లలో భాగంగా ఇతర స్టార్ హీరోలకు, హీరోయిన్లకు డేరింగ్ స్టంట్స్ చేయాలని సవాల్ విసురుతున్నాడు. తాజాగా ‘గబ్బర్ సింగ్’ బ్యూటీ శృతి హాసన్ కు ఓ సవాల్ చేశాడు. దీనికి థ్రిల్ అయిన శృతి సవాల్ ను స్వీకరించింది.

మీ మతాన్ని ఫాలో అవ్వండి. ఇతరులను గౌరవించండి. అనే ప్లకార్డు పట్టుకుని ఓ వ్యక్తి ప్రతి రోజు సిగ్నల్ వద్ద నాలుగు గంటలు నిలబడుతున్నాడు. ఇలా చేసినందుకు అతను మన నుండి ఎం ఆశించడం లేదు, కేవలం ఒక మంచి సమాజం కోరుకుంటున్నాడు. నువ్వు అతన్ని కౌగిలించుకోవాలి. ఆ వ్యక్తికి ఒక 30 సెకన్ల పాటు విశ్రాంతి ఇచ్చి, ఆ ప్లకార్డు పట్టుకుని ప్రపంచానికి సందేశం ఇవ్వాలి. ఇదే నేను శృతి హాసన్ కు చేస్తున్న సవాల్ అని హృతిక్ రోషన్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.

హృతిక్ సవాల్ కు థ్రిల్ అయిన శృతి…. ఓ మై గాడ్. ఎస్.. సరైన సమయంలో ఈ అంకుల్ ను కనుకొని నా ‘బ్యాంగ్ బ్యాంగ్ డేర్’ టాస్క్ ను కంప్లీట్ చేస్తాను. సవాల్ ను స్వీకరిస్తున్నాను. అంటూ రిప్లై ఇచ్చింది.

Exit mobile version