వరుణ్ తేజ్ సినిమాకి భారీ బడ్జెట్

వరుణ్ తేజ్ సినిమాకి భారీ బడ్జెట్

Published on Nov 27, 2019 10:37 AM IST

Varun tej

వరుస విజయాలతో దూసుకుపోతున్న మెగా హీరో వరుణ్ తేజ్ తర్వాతి సినిమాను బాక్సింగ్ నేపథ్యంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కోసం వరుణ్ ప్రత్యేకంగా బాక్సింగ్ శిక్షణ తీసుకుంటున్నారు. సాధారణంగా ఇలాంటి స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమాలను అన్ని విధాలా ఖచ్చితత్వంతో రూపొందించాలంటే బడ్జెట్ ఎక్కువే కేటాయించాల్సి ఉంటుంది.

అందుకే ఈ చిత్ర నిర్మాతలు అల్లు బాబీ, సిద్దు ముద్దలు సినిమా కోసం దాదాపు రూ.35 కోట్ల వరకు ఖర్చు పెట్టనున్నారట. వరుణ్ తేజ్ గత సినిమాలు ‘ఎఫ్ 2, గద్దలకొండ గణేష’ చిత్రాలు మంచి విజయాలుగా నిలవడంతో ఇప్పుడు చేస్తున్న సినిమాకు బిజినెస్ పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే నిర్మాతలు సినిమాపై పెద్ద మొత్తంలో వెచ్చిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని కిరణ్ కొర్రపాటి డైరెక్ట్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు