నాని, నాగార్జునల సినిమా కోసం ఖరీదైన సెట్ !


యంగ్ హీరో నాని, సీనియర్ స్టార్ హీరో నాగార్జునలు కలిసి ఒక మల్టీ స్టారర్ చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ మొదలై ఒక షెడ్యూల్ కూడా ముగిసింది. రెండవ షెడ్యూల్ ను మే 2వ తేదీ నుండి మొదలుపెట్టనున్నారు. మే 10 నుండి నాగార్జున ఈ షెడ్యూల్లో జాయిన్ అవుతారు.

తాజా సమాచారం మేరకు ఈ షెడ్యూల్ కోసం భారీ కాలనీ సెట్ ను నిర్మించారట. ఈ సెట్ కోసం సుమారు కోటి రూపాయల్ని వెచ్చించారట. రెండు నెలలు కష్టపడి ఈ సెట్ ను రూపొందించారట. శ్రీరామ్ ఆదిత్య డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న నానికి జోడీగా నటించనుండగా నాగార్జున సరసన ఆకాంక్ష సింగ్ స్క్రీన్ షేర్ చేసుకోనుంది. ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ గా ఉండబోతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సి. అశ్వినీ దత్ నిర్మిస్తున్నారు.

Exit mobile version