హాట్ కేక్స్ లా సెల్ అవుతున్న ‘ఆగడు’ టికెట్స్

Published on Sep 17, 2014 6:53 pm IST

Aagadu

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా వస్తుంది అంటే ఘట్టమనేని అభిమానుల్లో పండుగ సంబరాలు మొదలవుతాయి. అదే ఒక వారం పది రోజుల్లో అసలైన దసరా అనగా మహేష్ సినిమా వస్తుంది అంటే ఘట్టమనేని అభిమానులకి దసరా వారం రోజుల ముందే మొదలయినట్టే.. నేను చెప్పిన రీతిలోనే దసరాకి రెండు వారాల ముందే అనగా ఈ నెల 19న మేహేష్ నటించిన పవర్ఫుల్ పోలీస్ ఎంటర్టైనర్ ‘ఆగడు’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమాకి సంబందించిన టికెట్ బుకింగ్ ఈ రోజు మొదలైంది… బుకింగ్ మొదలైన కొన్ని గంటల్లోనే ఈ సినిమా టికెట్స్ హాట్ కేక్స్ లా అమ్ముడు పోయాయి.. మొదటి రోజు షోలకి సంబంధించి దాదాపు అన్ని టికెట్స్ అమ్ముడు పోయాయి. ఈ క్రేజ్ ఒక్క హైదరాబాద్ లోనే కాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లోనూ కొనసాగుతోంది. ఇది కాకుండా రిలీజ్ రోజు ఉదయం వేయనున్న ఫ్యాన్స్ షో టికెట్స్ కోసం కూడా భారీ పోటీ నెలకొంది.

మహేష్ బాబు అభిమానులు ఎంత రేటైనా సరే వెనుకాడకుండా ఫ్యాన్స్ షో టికెట్స్ తీసుకుంటున్నారు. దానికి కారణం ‘దూకుడు’ తర్వాత అదే కాంబినేషన్ లో వస్తున్న కమర్షియల్ ఎంటర్టైనర్ కావడం.. తమన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో శృతి హాసన్ ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది.

సంబంధిత సమాచారం :