సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మాస్ ఎంటర్టైనర్ ‘ఆగడు’. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 19న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఏ సినిమా అయినా రిలీజ్ అయ్యాక రికార్డ్స్ సృష్టించడం మొదలు పెడుతుంది కానీ ఈ సినిమా మాత్రం విడుదలకి ముందే క్రేజీ రికార్డ్స్ సృష్టిస్తోంది. ఎన్నడూ లేనతంగా ఈ సినిమాని యుఎస్ లో సుమారు 160 థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. అలాగే ఈ 160 స్క్రీన్స్ లోనూ ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నారు.
యుఎస్ డిస్ట్రిబ్యూటర్స్ చెబుతున్న సమాచారం ప్రకారం ఆగడు ప్రీమియర్ షో టికెట్స్ కి భారీ డిమాండ్ ఉంది. యుఎస్ లో బుకింగ్ ఓపెన్ చేసిన ప్రతి చోటునుండి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే గురువారం ప్రీమియర్ షోస్ కి సంబందించిన 75% టికెట్స్ అమ్ముడైపోయాయి. మిగిలినవి మరి కొద్ది గంటల్లోనే అమ్ముడు పోయే అవకాశం ఉంది. ఇలా ఇన్ని థియేటర్స్ లో ప్రీమియర్స్ ప్లాన్ చేయడం అలాగే ఆ షోస్ అన్నిటికీ దాదాపు హౌస్ ఫుల్ క్రౌడ్ రావడం అనేది ఇదే మొదటిసారని చెప్పవచ్చు.
‘దూకుడు’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మహేష్ బాబు – శ్రీను వైట్ల కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడం వలన ఈ సినిమాపై ఈ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి. అలాగే తమన్నా హీరోయిన్ గా నటించడం, తమన్ మ్యూజిక్ హిట్ అవ్వడం మరియు ట్రైలర్ లోని పంచ్ డైలాగ్స్ ఆడియన్స్ కి బాగా చేరువవ్వడం కూడా ఈ క్రేజ్ కి కారణం అయ్యాయి.


