మహేష్ బాబును చుట్టుముట్టిన అభిమానులు.

మహేష్ బాబును చుట్టుముట్టిన అభిమానులు.

Published on Nov 12, 2014 12:08 PM IST

Mahesh

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కేవలం హైదరాబాద్ లోనే కాదు, పూణేలో కూడా మహేష్ కు చాలా మంది అభిమానులు ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న సినిమా షూటింగ్ పూణేలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఒక సాఫ్ట్ వేర్ హబ్ ప్రాంగణంలో మహేష్ మరియు ఇతర నటులపై సన్నివేశాలు చిత్రీకరిస్తున్న సమయంలో అభిమానులు చుట్టుముట్టారు. తమ ఫేవరెట్ హీరో షూటింగ్ చూడడానికి ఎగబడ్డారు. టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ మహేష్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను మరోసారి ఈ సంఘటన నిరూపించింది.

శృతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. మైత్రి మూవీస్ పతాకంపై యలమంచిలి రవి శంకర్, మోహన్, ఎర్నేని నవీన్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సినిమా టైటిల్ ఇంకా ఖరారు చేయలేదు.

తాజా వార్తలు