గత వారం విడుదలైన ‘మహానటి’ చిత్రం దిగ్విజయంగా ప్రదర్శింపబడుతున్న సంగతి తెలిసిందే. ప్రేక్షకులు, విమర్శకుల నుండి సినిమాకు మంచి స్పందన దక్కగా సినీ పెద్దలు సైతం చిత్రాన్ని కొనియాడుతున్నారు. దీంతో చిత్ర శాటిలైట్ హక్కులకు భారీ డిమాండ్ నెలకొంది. పలు పాపులర్ ఛానెళ్లు చిత్ర హక్కుల కోసం పోటీపడుతున్నాయి.
నిర్మాతలకు రూ.11 కోట్లకు ఆఫర్ వచ్చిందట. కానీ సినిమా భారీ విజయాన్ని దక్కించుకోవడంతో ఇంకా పెద్ద మొత్తానికి హక్కుల్ని అమ్మాలని నిర్మాతలు భావిస్తున్నారట. తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు ఇప్పటికే ఊపందుకోగా ఓవర్సీస్లో ప్రీమియర్స్ నుండే కలెక్షన్స్ బలంగా కొనసాగుతున్నాయి. ఈ సినిమా విజయంతో దర్శకుడు నాగ్ అశ్విన్ టాప్ దర్శకుల జాబితాలో చేరిపోయారు.


