యువ సామ్రాట్ నాగ చైతన్య , సమంత జంటగా నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మజిలీ’. నిన్నటి తో ఈ చిత్రం యొక్క వైజాగ్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. ఈషెడ్యూల్ లో రెండు సాంగ్స్ ను చిత్రీకరించారు. ఇక ఈ చిత్రం యొక్క శాటిలైట్ మరియు డిజిటల్ హక్కులను దక్కించుకునేందుకు ప్రముఖ ఛానెళ్లు ఆసక్తి కనబరుస్తున్నాయి. రొమాంటిక్ ఎంటర్టైనెర్ గా తెరకెక్కుతున్న ఈ మజిలీ లో నాగ చైతన్య క్రికెటర్ గా కనిపించనున్నాడు.
గోపి సుందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో హిందీ నటి దివ్యంక కౌశిక్ మరో హీరోయిన్ గా నటిస్తుంది. షైన్ స్క్రీన్స్ పతాకం ఫై సాహు గారపాటి , హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్న ఈచిత్రం ఏప్రిల్ 5న విడుదలకానుంది. ఇక వివాహ అనంతరం చై -సామ్ కలిసి నటిస్తున్న మొదటి చిత్రం కావడంతో ఈ సినిమా ఫై మంచి అంచనాలు వున్నాయి.
