మాస్ మహారాజ్ “క్రాక్” రీమేక్ కు భారీ డిమాండ్.!

మాస్ మహారాజ్ “క్రాక్” రీమేక్ కు భారీ డిమాండ్.!

Published on Jan 17, 2021 11:00 PM IST

లేటెస్ట్ గా మాస్ మహారాజ్ రవితేజ నటించిన చిత్రం “క్రాక్”తో ఒక అదిరిపోయే కం బ్యాక్ హిట్ ను అందుకున్న సంగతి తెలిసిందే. మరి రవితేజ అందుకున్న ఈ సాలిడ్ కం బ్యాక్ ఇతర ఇండస్ట్రీలలో కూడా మంచి హాట్ టాపిక్ అవుతుంది. అందుకే ఈ చిత్రం తాలూకా రీమేక్ హక్కులకు గాను భారీ డిమాండ్ పలుకుతున్నట్టుగా తెలుస్తుంది.

ఇప్పటికే ఈ సినిమా హిందీ రీమేక్ హక్కులకు గాను సోనూ సూద్ ఆల్రెడీ భారీ ఆఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే మరోపక్క తమిళ్ లో కూడా ఈ సినిమా రీమేక్ హక్కుల కోసం మంచి పోటీ నెలకొందట. ప్రముఖ బ్యానర్ సంస్థలు క్రాక్ రీమేక్ హక్కులను కొనుగోలు చేసేందుకు రెడీగా ఉన్నారని తెలుస్తుంది.

మొత్తానికి మాత్రం మాస్ మహారాజ్ మరియు గోపీచంద్ మలినేని ల హ్యాట్రిక్ హిట్ రీసౌండ్ గట్టిగానే వినిపిస్తుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి థమన్ ఇచ్చిన టెర్రిఫిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కు మంచి రెస్పాన్స్ రాగా ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు