‘బైకర్’ ప్రీమియర్ షోలకు సాలిడ్ రెస్పాన్స్..!

 Biker

శర్వానంద్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘బైకర్’ ( Biker )బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు రెడీ అయింది. మోటార్ రేసింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 3న విడుదల కానుంది. అయితే, ఒక రోజు ముందుగానే అంటే ఏప్రిల్ 2న హైదరాబాద్‌లోని పలు థియేటర్లలో పెయిడ్ ప్రీమియర్స్ ఏర్పాటు చేశారు. ఈ షోలకు సంబంధించిన టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోయి, అప్పుడే అన్ని చోట్లా హౌస్‌ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి.

ప్రేక్షకుల నుండి వస్తున్న ఈ భారీ రెస్పాన్స్ చూసి చిత్ర యూనిట్ మరిన్ని థియేటర్లలో అదనపు ప్రీమియర్ షోలను ప్లాన్ చేస్తోంది. శర్వానంద్ ఈ సినిమా కోసం చేసిన మేకోవర్ మరియు కొత్త రకమైన కథాంశం ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేశాయి. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటించగా, సీనియర్ నటుడు రాజశేఖర్ ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు.

దర్శకుడు అభిలాష్ రెడ్డి రూపొందించిన ఈ ‘బైకర్’ కేవలం రేసింగ్ మాత్రమే కాకుండా మంచి ఎమోషనల్ రైడ్‌గా ఉండబోతోంది. విజువల్స్ మరియు సౌండ్ పరంగా సరికొత్త అనుభూతినిచ్చే ఈ చిత్రం, శర్వానంద్ కెరీర్‌లో పెద్ద హిట్ అవుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

Exit mobile version