పవన్ రీఎంట్రీ వేడుక అదిరిపోయేలా ఉంటుందట

PawanKalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇస్తూ చేసిన చిత్రం ‘వకీల్ సాబ్’. చాన్నాళ్ల తర్వాత పవన్ ను స్క్రీన్ మీద చూడబోతుండటంతో అభిమానుల్లో మంచి ఉత్సుకత నెలకొంది. సినిమా రిలీజ్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అన్ని పనులు ముగించుకున్న ఈ సినిమా ఏప్రిల్ 9న విడుదలకానుంది. అయితే టీమ్ ఇప్పటివరకు భారీ ప్రమోషన్స్ ఏవీ చేపట్టలేదు. టీజర్, పాటలు మినహా ఎలాంటి కార్యక్రమాలు లేవని ఫ్యాన్స్ కొంత నిరుత్సాహానికి గురవుతున్నారు.

అయితే ఈ ఆలస్యం వెనుక పెద్ద ప్లానింగ్ ఉందట. పవన్ రీఎంట్రీ సినిమా కావడంతో భారీ ఈవెంట్ ప్లాన్ చేశారట నిర్మాత దిల్ రాజు. ఏప్రిల్ 3వ తేదీన ఈ ఈవెంట్ జరగవచ్చని తెలుస్తోంది. అయితే ఇంతవరకు ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ అందలేదు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు. బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు బ్యానర్ పై రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఇందులో శృతి హాసన్ కథానాయికగా నటించగా అంజలి, నివేతా థామస్, అనన్య నాగళ్ళ కీలక పాత్రలు చేశారు.

Exit mobile version