కల్కి పై మరింత పెరిగిన అంచనాలు!

కల్కి పై మరింత పెరిగిన అంచనాలు!

Published on Apr 22, 2024 12:00 AM IST

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రధాన పాత్రలో, డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ కల్కి2898AD (Kalki 2898AD). ఈ చిత్రం ను అనౌన్స్ చేసిన తొలి రోజు నుండి సినిమా పై అందరిలో ఆసక్తి నెలకొంది. పాన్ వరల్డ్ మూవీ కావడం తో సినిమా ను మరింత గ్రాండ్ గా ప్లాన్ చేసారు మేకర్స్. అయితే ఈ చిత్రం లో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకునే, దిశా పటాని లాంటి బిగ్ స్టార్స్ ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

తాజాగా ఈ చిత్రం నుండి అశ్వథ్థామ ఇంట్రో వీడియో ను రిలీజ్ చేయగా, ఆడియెన్స్ నుండి అల్టిమేట్ రెస్పాన్స్ వస్తోంది. వీడియో క్వాలిటీ నుండి, అమితాబ్ రోల్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. డైరెక్టర్ నాగ్ అశ్విన్, ఆడియెన్స్ కి త్వరలో మాంచి ట్రీట్ ను అందించనున్నారు అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలకి సూపర్ రెస్పాన్స్ రాగా, ఈ అమితాబ్ బచ్చన్ రోల్ కి సంబందించిన వీడియో మరింత అంచనాలను పెంచేసింది అని చెప్పాలి. అన్ని బాషల్లో కూడా ఒకేసారి గా ప్రమోట్ చేస్తూ, అందరి దృష్టిని ఆకర్షించేలా మేకర్స్ చేస్తున్న ప్లాన్ కూడా సూపర్ అనే చెప్పాలి. వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం కి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు