
ఈ ఏడాది బాక్స్ ఆఫీసు దగ్గర సునామీని సృష్టించి,తెలుగు సినిమా స్థాయిని హాలీవుడ్ కి పరిచయం చేసిన సినిమా ‘బాహుబలి’. ఈ సినిమా చాలా మంది స్టార్స్ కి బిగ్ బ్రేక్ ఇచ్చిందని చెప్పాలి. అలా మంచి పేరు తెచ్చుకున్న వారిలో యంగ్ యాక్టర్ అడవి శేష్ కూడా ఒకడు. ఈ సినిమా తర్వాత అడవి శేష్ కి చాలా మంచి ఆఫర్స్ వస్తున్నాయి. అవి పక్కన పెడితే అడవి శేష్ హీరోగా పివిపి బ్యానర్ లో ‘క్షణం’ అనే సినిమా చేస్తున్నాడు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమాలో ఆద శర్మ, అనసూయ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
ఇది కాకుండా అడవి శేష్ తన బ్రదర్ అయిన సాయి కిరణ్ అడవి డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తాడని ఇది వరకే తెలియజేశాం. ఇటీవలే కేరింతతో హిట్ అందుకున్న సాయి కిరణ్ అడవి శేష్ కోసం ఓ కథని సిద్దం చేసాడు. ఈ సినిమాకి ‘చిలిపి దెయ్యం’ అనే టైటిల్ని ఫిక్స్ చేసారు. అలాగే ఈ సినిమాలో అడవి శేష్ దెయ్యం పాత్రలో కనిపిస్తాడు. అలా అని ఇది హర్రర్ సినిమా కాదని రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ఉంటుందని సమాచారం. ఈ సినిమా వచ్చే ఏడాది మొదట్లో సెట్స్ పైకి వెళ్లనుంది.