
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం ఈ పేరు దేశవ్యాప్త రాజకీయాల్లో హల్ చల్ చేస్తోంది. 2014 ఎన్నికల వేడి తగ్గుతుండడంతో పవన్ కళ్యాణ్ మళ్ళీ తన దృష్టి సినిమాలపై పెట్టడానికి సిద్దమయ్యాడు. అందులో భాగంగా త్వరలోనే ‘గబ్బర్ సింగ్ 2’ని పట్టాలెక్కించే పనిలో పడ్డాడు.
సంపత్ నంది దర్శకత్వం వహించనున్న ఈ సినిమాకి స్క్రిప్ట్ మొత్తం సిద్దమైంది. ఇక పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం మాత్రమే మిగిలి ఉంది. ప్రస్తుతం పవన్ సరనస సరిపోయే హీరోయిన్ కోసం ఈ చిత్ర టీం అన్వేషిస్తున్నారు. ‘గబ్బర్ సింగ్’ కథకి ఈ కథకి సంబంధం లేకపోయినా పవన్ పాత్ర మాత్రం అంతే తిక్కతో ఉంటుందని సమాచారం. శరత్ మరార్ ఈ సినిమాకి నిర్మాత.
‘గబ్బర్ సింగ్ 2’ కాకుండా పవన్ కళ్యాణ్ వెంకటేష్ తో కలిసి చేయనున్న మల్టీ స్టారర్ మూవీ షూటింగ్ ఇప్పటికే మొదలైంది. పవన్ జూన్ నుంచి ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటాడు.

