సమీక్ష: హుషార్ పిట్టలు –  కొన్ని సీన్స్ ఇబ్బంది పెట్టినా సందేశం బాగుంది

విడుదల తేదీ : ఆగస్టు 15, 2026

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : వాసవి గణేశన్, అన్ష్, గోవర్ధన్ రెడ్డి, రమేష్ నకిరేకంటి, అంజి తదితరులు
దర్శకత్వం : భిక్షు
సంగీతం : చరణ్ అర్జున్
నిర్మాత : వెంకట్ యాదవ్
సినిమాటోగ్రఫీ : రుద్ర సాయి
ఎడిటింగ్ : మార్తాండ్ కే వెంకటేష్

సంబంధిత లింక్స్ : ట్రైలర్

ఈ వారం థియేటర్స్ లో రిలీజ్ కి వచ్చిన తాజా చిత్రాల్లో బోల్డ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం “హుషార్ పిట్టలు” కూడా ఒకటి. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

ఓ చిన్నపాటి గ్రామానికి చెందిన టీనేజర్స్ రవి (అన్ష్), చిట్టి (వాసవి గణేశన్) లలో రవి అప్పుడే పదో తరగతి పూర్తి చేసి ఇంటర్ కి వస్తాడు. చిట్టి స్కూల్ స్టేజి లోనే ఉంటుంది కానీ ఇద్దరూ ఒకరి పట్ల ఒకరు ఆకర్షితులై హద్దులు దాటి ప్రవర్తించడం మొదలు పెడతారు. కానీ వీరిపైనే పంచ ప్రాణాలు పెట్టుకున్న వారి తల్లిదండ్రులు మాత్రం తమ పిల్లలు బాగుపడతారు. పెద్ద స్థాయికి వెళతారు అని భావిస్తారు. ఈ క్రమంలో రవి, చిట్టిలు ఏం చేశారు? తమ తల్లిదండ్రుల మాట విని మారారా లేదా? ఈ ప్రాసెస్ లో వారు తెలుసుకున్నది ఏంటి? ఈ చిత్రం ద్వారా దర్శకుడు ఇచ్చిన సందేశం ఏంటి అనేవి తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్:

ఈ చిత్రంలో మొదటిగా మాట్లాడుకోవాలింది మాత్రం దర్శకుడు తీసుకున్న బోల్డ్ అటెంప్ట్ కోసమే అని చెప్పాలి. తాను ఇచ్చిన సందేశం ఇందులో చాలా బాగుంది. ప్రస్తుతం ఉన్న జెనరేషన్ లో టీనేజ్ లో ఉన్న పిల్లలు ఎలా పాడైపోతున్నారు అనే అంశాన్ని నిక్కచ్చిగా కళ్ళకి కట్టినట్టు చూపించేసారు. పైగా దీనికి సాలిడ్ కామెడీ ఎలిమెంట్స్ ని కూడా యాడ్ చేయడం సినిమాలో బాగుంది.

ఫస్టాఫ్, సెకండాఫ్ లలో కొన్ని కామెడీ సీన్స్ తో పాటుగా అక్కడక్కడా ఆలోచింపజేసే సన్నివేశాలు ఇందులో యాడ్ చేయడం వంటివి బాగున్నాయి. ఇక వీటితో పాటుగా లీడ్ జంటలో కనిపించిన యువ నటీనటులు మాత్రం సాలిడ్ పెర్ఫామెన్స్ చేశారు. ఒక రకంగా ఫీమేల్ లీడ్ వాసవి గణేశన్ కి ఇది తన మొదటి సినిమా అయినా చాలా బోల్డ్ అటెంప్ట్. ఆమె ధైర్యానికి ఇందులో మెచ్చుకోవాలి. అలానే తన పాత్రలో ఆమె బాగా చేసింది.

ఇక యువ నటుడు అన్ష్ కూడా తన పాత్రలో బాగా చేసాడు. తన లుక్స్ గాని నటన గాని సినిమాలో బాగున్నాయి. ఇక వీరితో పాటుగా తమ తల్లిదండ్రుల పాత్రల్లో నటించిన గోవర్ధన్ రెడ్డి, రమేష్ నకిరేకంటి చాలా బాగా చేశారు. వీరితో పాటుగా ఇతర నటీనటులు పాత్రలు కూడా ఎక్కడా వేస్ట్ కాకుండా నీట్ గా ఉన్నాయి. వాటిలో వారంతా బాగా చేశారు.

మైనస్ పాయింట్స్:

ఎంత సందేశం బాగున్నప్పటికీ దీనిని చెప్పే ప్రయత్నంలో చూపించిన బోల్డ్ కంటెంట్ పరంగా మాత్రం ఇంకాస్త కేర్ తీసుకోవాల్సింది. ఇద్దరు టీనేజర్స్ నడుమ కెమిస్ట్రీని చూపించిన విధానం మరీ మితి మీరినట్టు అనిపిస్తుంది.

సో వీటితో సోలోగా చూసే ఆడియెన్స్ కి సినిమా ఓకే కానీ ఫ్యామిలీ ఆడియెన్స్ తో కలిసి చూద్దామనికుంటే ఖచ్చితంగా ఆ సీన్స్ ఎబ్బెట్టుగా అనిపించక మానదు. సో వీటి విషయంలో మరికాస్త జాగ్రత్త వహించాల్సింది.

ఇక వీటితో పాటుగా అక్కడక్కడా సీన్స్ లో లాజిక్స్ కూడా మిస్ అయినట్టు కనిపిస్తుంది. వీటిని సింపుల్ గా వదిలేసారు. ఇలాంటి వాటిలో కూడా కొంచెం కేర్ తీసుకోవాల్సింది. పైగా సబ్జెక్టుపై ఆల్రెడీ ఓ ఐడియా ఉంటుంది కాబట్టి కథనం దాదాపు ఊహాజనితంగానే సాగుతుంది.

సాంకేతిక వర్గం:

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు మాత్రం ప్యాకెడ్ గా ఉన్నాయి. దాదాపు సినిమాకి వర్క్ చేసినవారు అంతా కొత్తవాళ్లే అయినప్పటికీ ఈ ప్రాజెక్ట్ ని బాగా చేశారు. ముఖ్యంగా చరణ్ అర్జున్ సంగీతం ఇంప్రెస్ చేస్తుంది. పాటలు డిజైన్ చేసిన తీరు, ఆయా పాత్రలకి తగ్గట్టుగా ప్లాన్ చేసిన కొన్ని బ్యాక్గ్రౌండ్ సాంగ్స్, అందులో సాహిత్యం బాగున్నాయి. రుద్ర సాయి కెమెరా వర్క్ డీసెంట్ గా ఉంది. మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటింగ్ కూడా బాగుంది.

ఇక దర్శకుడు భిక్షు విషయానికి వస్తే.. తాను ప్లాన్ చేసుకున్న సందేశం ఇందులో బాగుంది దానికి ఎలాంటి వంకలు పెట్టడానికి లేదు. అయితే ఈ క్రమంలో ప్లాన్ చేసుకున్న కథనం మాత్రం హార్డ్ హిట్టింగ్ గా మలిచే ప్రయత్నంలో అడల్ట్ కంటెంట్ ఎక్కడో గీత దాటినట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా ఇది ఫ్యామిలీ ఆడియెన్స్ కి కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు. ఇది పక్కన పెడితే తన వర్క్ బాగుంది. బ్యాలన్సుడ్ గా ప్లాన్ చేసుకున్న కథనం తన నుంచి మెప్పిస్తుంది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ ‘హుషార్ పిట్టలు’లో సందేశం వర్కౌట్ అవుతుంది కానీ దీని కోసం ప్లాన్ చేసుకున్న మిగతా కథనంలో బోల్డ్ సీన్స్ మాత్రం కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తాయి. దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్, ప్రెజెంట్ జెనరేషన్ యువత ఎలా పాడవుతున్నారు అనే అంశాలు కళ్ళకి కట్టినట్టు చూపించారు. అలాగే లీడ్ యువ జంట, వారి తల్లిదండ్రుల నటులు, వారిపై ఎమోషన్స్ ఆకట్టుకుంటాయి. కానీ ఇబ్బందికరంగా అనిపించే సన్నివేశాలు మాత్రం డిజప్పాయింట్ చేస్తాయి. వీటిని పక్కన పెడితే ఈ సందేశాత్మక చిత్రం మెప్పిస్తుంది.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Exit mobile version