మరో తెలుగు సినిమా కోలీవుడ్ లో రీమేక్ కానుంది !

మరో తెలుగు సినిమా కోలీవుడ్ లో రీమేక్ కానుంది !

Published on Jan 6, 2019 12:55 PM IST

Husharu3

తేజస్ కంచెర్ల ,తేజ్ కూరపాటి ,దినేష్ తేజ్ , అభినవ్ మేడిశెట్టి ,దక్ష నగరకర్, ప్రియా వడ్లమాని, హేమల్ ప్రధాన పాత్రల్లో శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హుషారు. లక్కీ మీడియా పతాకం ఫై బెక్కం వేణుగోపాల్ నిర్మించిన ఇటీవల విడుదలైయింది.

యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పుడు కోలీవుడ్ లో రీమేక్ కానుంది. ‘తేనవత్తు’ ఫేమ్ వివి కార్తీక్ తెరకెక్కించనున్న ఈ చిత్రాన్ని కాస్మోస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం ఫై ఫణేంద్ర కుమార్ నిర్మించనున్నారు. ఒరిజినల్ వెర్షన్ కు సంగీతం అందించిన ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ రధాన్ ఈ రీమేక్ కు కూడా సంగీతం అందించనున్నాడు. తర్వలోనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది.

తాజా వార్తలు