ఆ పాత్రలను మాత్రమే చేస్తున్నా – అవికా గోర్

ఆ పాత్రలను మాత్రమే చేస్తున్నా – అవికా గోర్

Published on Aug 3, 2026 7:02 AM IST

హీరోయిన్ అవికా గోర్ బాలనటిగా బుల్లితెరపై సందడి చేసి మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆ తర్వాత అవికా గోర్ తెలుగులో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఆమె ప్రముఖ స్టంట్ రియాలిటీ షో ‘ఖత్రోన్ కే ఖిలాడి’ ద్వారా మళ్లీ బుల్లితెరపై సందడి చేయబోతుంది. ఈ షో 15వ సీజన్‌ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె పలు ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు.

అవికా గోర్ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం నేను అన్ని పాత్రలు చేయడం లేదు. నా ప్రతిభను నిరూపించుకునే అవకాశం ఉన్న పాత్రలను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక ‘ఖత్రోన్ కే ఖిలాడి’ షో అంత సులభం కాదు. అది శారీరకంగా, మానసికంగా పెద్ద సవాల్‌. ప్రస్తుతం కొన్ని ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి. త్వరలో టీవీకి సంబంధించి కూడా ఓ ప్రాజెక్ట్ కూడా రాబోతోంది’ అని అవికా గోర్ చెప్పుకొచ్చింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు