గవర్నర్ ఆసక్తికరమైన ట్వీట్ కి పవన్ రీట్వీట్ !

గవర్నర్ ఆసక్తికరమైన ట్వీట్ కి పవన్ రీట్వీట్ !

Published on Mar 30, 2020 8:19 PM IST

కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు అమలు చేస్తోన్న లాక్‌డౌన్ కారణంగా ఆంధ్రాకు చెందిన మత్స్యకారులు చెన్నై హార్బర్‌ లో చిక్కుకుపోయారని తెలుపుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారికి సాయం చేయాలని పళనిస్వామిని ట్విట్టర్ ద్వారా కోరిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ట్వీట్ కి తమిళనాడు సీఎం స్పందించి వారి బాగోగులు చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తక్షణమే అప్రమత్తమైన అధికారులు ఏపీ మత్స్యకారులను కలిసి వారికి ఆహారం, నీళ్లు, ఇతర అత్యవసరాలను అందించారు. వారంతా క్షేమంగా ఉన్నారని.. వారి కుటుంబాలు చింతించాల్సిన అవసరం లేదని పవన్‌కు ఇందుకు సంబంధించిన ఫొటోలను తమిళనాడు సీఎం ట్వీట్ చేస్తూ తెలిపిన విషయం కూడా తెలిసిందే.

అయితే పవన్ కళ్యాణ్ చేసిన ఈ పనికి తెలంగాణ రాష్ట్రానికి తొలి మహిళా గవర్నర్ అయిన తమిళిసై సౌందరరాజన్ స్పందిస్తూ.. పవన్ కళ్యాణ్ గారు కరోనా వైరస్ అరికట్టడానికి చేపట్టిన లాక్ డౌన్ కారణంగా చెన్నై హార్బర్‌ ప్రాంతంలో చిక్కుకున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఏపీ మత్స్యకారుల బాధలను వినిపించడానికి మీరు చేసిన ప్రయత్నం కారణంగా.. తమిళనాడు సీఎం వెంటనే స్పదించి తగిన చర్యలు తీసుకున్నారు. మీది ప్రశంసనీయమైన ప్రయత్నం. దేవుడు మీ ప్రయత్నాలను ఆశీర్వదిస్తాడు అని సౌందరరాజన్ పోస్ట్ చేశారు.

సౌందరరాజన్ ట్వీట్ కి పవన్ కూడా రిప్లే ఇస్తూ.. మేడమ్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గారు గౌరవప్రదమైన మీ సందేశంతో నేను వినయంగా ఉన్నాను. మీ ఈ దయగల సందేశం, భవిష్యత్తులో నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రజలకు అండగా నిలబడటానికి నన్ను ప్రోత్సహిస్తుంది. మీ ద్వారా తమిళనాడు ప్రభుత్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయాలనుకుంటున్నాను’ అని పవన్ కళ్యాణ్ పోస్ట్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు