కృష్ణా జిల్లాలో ‘ఐ’ సినిమా కలెక్షన్ల వివరాలు

కృష్ణా జిల్లాలో ‘ఐ’ సినిమా కలెక్షన్ల వివరాలు

Published on Jan 20, 2015 2:09 AM IST

i-review
విక్రమ్, అమీ జాక్సన్ జంటగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన విజువల్ వండర్ ‘ఐ’ సినిమా ఫస్ట్ వీకెండ్ లో కృష్ణా జిల్లాలో సుమారు 1.32 కోట్లు కలెక్ట్ చేసింది. విడుదలకు ముందు ఈ సినిమాపై నెలకొన్న భారి అంచనాలకు తోడు శంకర్ ఇమేజ్ జత కలవడంతో సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 2.25 కోట్లకు కృష్ణా జిల్లా హక్కులను కొనుగోలు చేసినట్టు సమాచారం. మరో కోటి రూపాయలు వసూలు చేస్తే నష్టాల బారి నుండి తప్పించుకుంటారు. విడుదలైన తర్వాత ‘ఐ’ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. ప్రేక్షకులు మాత్రం సినిమాను చూడడం కోసం థియేటర్లకు క్యూ కడుతున్నారు. తమిళ, మలయాళ భాషలలో ఈ సినిమా రికార్డులు కొల్లగోడుతుంది.

విక్రమ్ నటన, పిసి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ, రెహమాన్ సంగీతం, అమీ జాక్సన్ అంద చందాలు సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి. భారి నిర్మాణ వ్యయంతో ఆస్కార్ రవిచంద్రన్ నిర్మించిన ఈ సినిమా చివరకు ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో వేచి చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు