సుశాంత్ సినిమాకి సైన్ చేయలేదన్న కేథరిన్

సుశాంత్ సినిమాకి సైన్ చేయలేదన్న కేథరిన్

Published on Nov 10, 2014 8:26 AM IST

catherine-tresa
‘చమ్మక్ చల్లో’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన కేథరిన్ ట్రేస ‘ఇద్దరమ్మాయిలతో’, ‘పైసా’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ భామ తెలుగు తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. తెలుగు కేథరిన్ ట్రేస హీరోయిన్ గా నటించిన సినిమా ‘ఎర్రబస్సు’. మంచు విష్ణు హీరోగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 14న రిలీజ్ కానుంది.

ఇదిలా ఉంటే కేథరిన్ మరో తెలుగు సినిమాకు సైన్ చేసిందనే వార్తలు వస్తున్నాయి. అదే వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ డైరెక్టర్ మేర్లపాక గాంధీ దర్శకత్వంలో సుశాంత్ హీరోగా నటించబోయే సినిమా. ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా కేథరిన్ నటించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఆ వార్తలను కేథరిన్ కొట్టి పారేసింది. ‘బయట వస్తున్నట్టు సుశాంత్ సినిమాకి నేను సైన్ చెయ్యలేదు. ప్రస్తుతం నా దృష్టి అంతా ఎర్రబస్సు రిలీజ్ పైనే ఉందని’ కేథరిన్ తెలిపింది. మరి కేథరిన్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘ఎర్రబస్సు’ సినిమా విడుదలై కేథరిన్ కోరుకునే బ్రేక్ ఇస్తుందేమో చూడాలి..

సంబంధిత సమాచారం

తాజా వార్తలు