మహేష్ బాబు, నాని సినిమాలు చూసి ఎంజాయ్ చేస్తానంటున్న స్టార్ క్రికెటర్ !

vvs lakshma maheshbabu

తెలుగు గడ్డ మీద నుంచి అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్న స్టార్ క్రికెటర్ వీవీఎస్‌ లక్ష్మణ్‌. ఈ హైదరాబాద్ సొగసరి బ్యాట్స్‌మెన్‌ ట్విటర్‌ వేదికగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు చెప్పారు. వాటిల్లో మరి ముఖ్యంగా తెలుగు హీరోల్లో తనకు ఎవరు ఇష్టమో ఏ హీరోల సినిమాలు చూసి తాను ఎంజాయ్ చేస్తాడో చెప్పారు.

వివరాల్లోకి వెళ్తే ఓ అభిమాని తెలుగు హీరోల్లో మీకు ఇష్టమైన హీరో ఎవరు అని అడగగా.. లక్ష్మణ్ స్పందిస్తూ తెలుగులో ఎంతోమంది ప్రతిభావంతులైన నటులు ఉన్నారు. అయితే నేను ఎక్కువుగా మహేష్‌ బాబు, నాని సినిమాలను చూస్తూ ఎంజాయ్‌ చేస్తానని తెలిపారు. నిజంగా ఇది సూపర్ స్టార్ అభిమానులకు చాలా సంతోషకరమైన విషయమే,

Exit mobile version