శంకర్ అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ‘ఐ’ సినిమా ఆడియో లాంచ్ తరువాత ఈ సినిమాపై అంచనాలు భీకరంగా పెరిగిపోయాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే తమిళనాటతో పాటు తెలుగులో సైతం ఈ చిత్రానికి ఆదరణ అనూహ్యంగా పెరిగింది
ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ నభూతో అన్న రేంజ్ లో వుండడంతో చూస్తున్న ప్రతీ ప్రేక్షకుడికి ఆసక్తిని కలిగించింది. దీనికి తోడు తెలుగు అనువాద హక్కులను భారీ ధరకు సొంతం చేసుకోవడంతో ఈ చిత్రంపై వున్న క్రేజ్ ఏంటో తెలుస్తుంది
శంకర్ క్రియేటివ్ వండర్ కి హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ నుండి సైతం ప్రశంసల వర్షం దక్కింది. దీనికారణంగా శంకర్ నేషనల్ బ్రాండ్ దాటి ఇంటర్నేషనల్ రేంజ్ కి వెళ్ళిపోయాడు


