హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మికి తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. ప్రస్తుతం ‘గట్టా కుస్తీ 2’ విజయాన్ని ఆస్వాదిస్తోంది. వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది, పైగా బాలీవుడ్ ఎంట్రీ సహా రెండు వెబ్ సిరీస్‌లు, ఒక ఫిమేల్ లీడ్ తమిళ సినిమా కూడా చేస్తోంది. ఐతే తాజాగా ఐశ్వర్య లక్ష్మి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నిజానికి నాకు కామెడీ మూవీస్ అంటే ఇష్టం. అలాగే, సినిమాల్లో కామెడీ సీన్స్ లో యాక్ట్ చేయడం నాకు బాగా ఇంట్రెస్ట్. కానీ, కామెడీ పండించడంలో నేను ఇంకా బెటర్ అవ్వాలి, కచ్చితంగా అవుతాను’ అంటూ ఐశ్వర్య లక్ష్మి కామెంట్స్ చేశారు.
ఐశ్వర్య లక్ష్మి ఇంకా మాట్లాడుతూ.. ‘సోషల్ మీడియా అంటేనే నెగిటివిటీ. నాకు ఎప్పుడూ సోషల్ మీడియాలో సురక్షితంగా ఉన్నాను అనే ఫీలింగ్ కలగలేదు. అందుకే, సోషల్ మీడియాలోకి మళ్లీ తిరిగి రావాలనే ఆలోచనే నాకు లేదు. ఓ సందర్భంలో నా ఫొటోలను మార్ఫ్ చేశారు, పైగా నన్ను ట్రోల్ చేశారు. ఇక నా డాగ్ కి ఓ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఉంది. ఆ ఎకౌంట్ ద్వారానే సినిమా అప్‌డేట్స్ చూస్తాను’ అని ఐశ్వర్య లక్ష్మి తెలిపింది.


