ఆ వార్తలలో నిజం లేదు – హన్సిక

ఆ వార్తలలో నిజం లేదు – హన్సిక

Published on Jul 16, 2014 12:38 PM IST

Hansika
ప్రస్తుతం చేతిలో ఉన్న చిత్రాలు పూర్తి చేయడానికి సమయం సరిపోవడం లేదు. కొత్త సినిమాలు అంగీకరించే ఖాళీ ఎక్కడ ఉంది అంటుంది పాలబుగ్గల చిన్నది హన్సిక. ప్రస్తుతం హన్సిక ఏడు చిత్రాలలో నటిస్తుంది. తెలుగులో రవితేజ సరసన నటిస్తున్న ‘పవర్’ మినహాయిస్తే మిగిలినవన్నీ తమిళ చిత్రాలే. తాజాగా హన్సిక కన్నడలో ఒక చిత్రం చేస్తుందంటూ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వీటికి చెక్ పెట్టింది హన్సిక. అటువంటి ఏమి లేదంటూ ట్విట్టర్లో వివరణ ఇచ్చింది.

‘నేను కన్నడ చిత్రంలో నటిస్తున్నాను అంటూ రూమర్స్ వస్తున్నాయి. వాటిలో నిజం లేదు. కన్నడ సినిమాకి సంతకం చేయలేదు. నా నెక్స్ట్ సినిమా గురించి త్వరలో వెల్లడిస్తాను’ అంటూ ట్వీట్ హన్సిక చేసింది.
Hansika

తాజా వార్తలు