
నటుడు శ్రీని అవసరాల దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా ‘ఊహలు గుసగుసలాడే’. ఈ సినిమా ద్వారా రాశి ఖన్నా హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం కానుంది. సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ రాశి ఖన్నా ఒకింత ఆసక్తిగా, ఒకింత టెన్షన్ గా ఉంది.
తెలుగు ఇండస్ట్రీకి రాకముందు తెలుగు నటుల్ని ఎవరినన్నా కలిసారా? అలాగే తెలుగు సినిమాలు ఏమన్నా చూసారా అని రాశి ఖన్నాని అడిగితే ‘ నేను తెలుగు సినిమా లను సబ్ టైటిల్స్ తో చూసేదాన్ని కానీ అప్పుడు వాళ్ళు నాకు ఎవరు అనేది తెలియదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాకు మహేష్ బాబు, నాగార్జున తప్ప ఇంకెవరూ తెలియదు. అందరూ తెలియకపోయిన పరవాలేదు, అందరికీ వారి వారి స్పెషాలిటీ ఉంది మరియు అందరూ క్రియేటివ్ పీపుల్. నాకు వాళ్ళందరితో కలిసి పనిచేయాలని ఉంది. ప్రస్తుతం ఆ విషయంపైనే దృష్టి పెట్టాను. త్వరలోనే లేదా కాస్త ఆలస్యంగా ఇండస్ట్రీ పీపుల్ నా గురించి తెలుసుకుంటారు. కానీ ప్రస్తుతానికి నేను మాత్రం నా మొదటి తెలుగు సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని’ తెలిపింది.
నాగ శౌర్య హీరోగా నటించిన ఈ సినిమా జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కాకుండా ప్రస్తుతం తను సందీప్ కిషన్ హీరోగా కుమార్ నాగేంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న కుమార్ నాగేంద్ర సినిమాలో కూడా నటిస్తోంది.

