ఇంటర్వ్యూ : అనూప్ రూబెన్స్ – నాకు ’90ఎంఎల్’ అలవాటు లేదు కానీ, కథే ఆ కిక్ ఇచ్చింది.

ఇంటర్వ్యూ : అనూప్ రూబెన్స్ – నాకు ’90ఎంఎల్’ అలవాటు లేదు కానీ, కథే ఆ కిక్ ఇచ్చింది.

Published on Nov 30, 2019 11:20 PM IST

హీరో కార్తికేయ డిఫరెంట్ కాన్సెప్ట్ తో చేస్తోన్న కొత్త చిత్రం ’90ఎంఎల్’. అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శేఖర్ రెడ్డి ఎర్రా తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ చిత్రం విడుదలకి సిద్ధంగా ఉండగా, మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ మీడియాతో మాట్లాడారు. ఈ సంధర్భంగా అనూప్ రూబెన్స్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఆ విశేషాలు ఇప్పుడు మీ కోసం..

 

ఈ చిత్రంలో మొత్తం ఎన్ని పాటలున్నాయి.?

మొత్తం ఆరు 6 పాటలు, ఒక బిట్ సాంగ్ ఉన్నాయి. అన్నీ రకాల మాస్ సాంగ్స్ ఉంటాయి, కార్తికేయ బయట ఎలా ఉంటాడో దర్శకుడు శేఖర్ రెడ్డి ఈ చిత్రంలో అలాగే చూపించారు.

 

ఈ చిత్రంలో సంగీతానికి మంచి స్కోప్ ఉందా. ?

సినిమాలో సాంగ్స్ కి స్కోప్ చాలా ఉంది, అలాగని పాటల నిడివి మాత్రం ఎక్కువ ఉండదు, దర్శకుడు కథని అలా మలిచారు. నేను రెండు మూడు మాస్ సినిమాలు చేసాను కానీ ఇది దానికి పూర్తి భిన్నంగా చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది.

 

ఈ మధ్యలో మీ కెరీర్ చాల స్లోగా సాగుతుంది ?

అవును. ఈ మధ్య కాలంలో నేను అనుకున్నవి కొన్ని జరగలేదు, పెద్ద ప్రాజెక్ట్స్ కొన్ని అనుకున్నట్టుగా అవ్వలేదు కానీ నా చేతిలో ఏమి లేదు, సమయం వచ్చినపుడు ఏది ఎలా జరగాలో అలానే జరుగుతుంది. నేను అదే నమ్ముతాను.

 

దర్శకుడు పూరి గారి తో మీ జర్నీ ఎలా ఉంది?

ఆయనతో నాకు ముందునుండి మంచి అనుబంధం ఉంది, రెగ్యులర్ గా మాట్లాడటమే కాక అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం. ఆయన ఒక డైరెక్టర్ గా కంటే మంచి వ్యక్తిగా నాకు బాగా ఇష్టం, పరిచయం.

 

ప్రస్తుతం వెబ్ సిరీస్ ల ట్రెండ్ నడుస్తుంది. మీరు కూడా వెబ్ సిరీస్ కి ఏమైనా పని చేస్తున్నారా.?

ప్రస్తుతానికి ఎలాంటి వెబ్ సిరీస్ ఇంకా స్టార్ట్ చేయలేదు, ఏదైనా ఆసక్తికరమైన ప్రాజెక్ట్ వస్తే తప్పకుండా చేస్తాను.

 

నితిన్ తో కొత్త చిత్రం ఏమైనా చేస్తున్నారా.?

అవును. నితిన్ తో ఓ మూవీ చేస్తున్నాను. త్వరలోనే అధికారకంగా అనౌన్స్ చేస్తాము.

 

ఒక చిత్రానికి పని చేసేటప్పుడు కథని దృష్టిలో పెట్టుకుంటారా? హీరోని దృష్టిలో పెట్టుకుంటారా?

ముందుగా కథని ఆ తరువాత హీరోని దృష్టిలో పెట్టుకుంటాను. ఎందుకంటే ఎక్కువసార్లు హీరోని బట్టి అతనికున్న క్రేజ్ ని బట్టి కూడా సంగీతం మార్చేయాల్సి ఉంటుంది.

 

సంగీత దర్శకుల మీద మీద రెండు ఫిర్యాదులుంటాయి, ఒకటి విదేశీ మ్యూజిక్ కాపీ కొడతారని, అలాగే కొట్టిన ట్యూన్లే మళ్ళీ మళ్ళీ కొడతారని, మీరేమంటారు ?

ప్రతీ సంగీత దర్శకుడిలో ఒక స్టైల్ ఉంటుంది. మేము ఇచ్చిన ఒక 100 ట్యూన్స్ లో ఐదు ట్యూన్ లు ఎక్కడో టచ్ అవుతాయి అది కాపీ కాదు, మక్కీ కి మక్కీ దించడం తప్పు.

అలా దించడంలో అసలు మ్యూజిక్ డైరెక్టర్ ప్రతిభ ఏముంటుంది.

 

మీ తదుపరి సినిమాలు గురించి చెప్పండి ?

పస్తుతానికి అయితే కన్నడలో ఒక సినిమా చేస్తున్నాను. అలాగే తెలుగులో కూడా కొన్ని డిస్కషన్ లు జరుగుతున్నయి. త్వరలోనే ఆ సినిమాల పూర్తి వివరాలు తెలియజేస్తాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు