నాకు యాక్షన్ సినిమాలంటే చాలా ఇష్టం : శ్రీను వైట్ల

Published on Sep 24, 2012 2:26 pm IST

మొదట్లో ‘నీ కోసం’ మరియు ‘ఆనందం’ లాంటి ప్రేమకథా చిత్రాకు తీసి ప్రేక్షకుల చేత మెప్పు పొందిన దర్శకుడు శ్రీను వైట్ల. ఆ తర్వాత శ్రీను వైట్ల రూటు మార్చి యాక్షన్ మరియు కామెడీ కలగలిపిన సినిమాలు తీయడంలో తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్నారు. వరుసగా పెద్ద హీరోలతో సినిమాలు చేస్తూ ‘దూకుడు’ తో బాక్స్ ఆఫీసు రికార్డులు బద్దలు కొట్టిన శ్రీనువైట్ల గారి పుట్టిన రోజు ఈ రోజు. ఈ సందర్భంగా యాక్షన్ మరియు కామెడీ కలగలిపిన సినిమాలు తీయడం కష్టంతో కూడుకున్న పని మీరు ఎలా రెండిటిని సమం చేయగలుగుతున్నారు? అని ఓ ప్రముఖ పత్రిక అడిగిన ప్రశ్నకు శ్రీను వైట్ల సమాధానమిస్తూ ‘ నాకు హై వోల్టేజ్ ఉన్న యాక్షన్ సినిమాలన్నా మరియు ఫుల్ హీరోయిజం చూపించే మాస్ సినిమాలన్నా నాకు చాలా ఇష్టం, అలాంటి సినిమాలనే ఎక్కువగా చూస్తాను. అలాగే జంధ్యాల, ఇ.వి.వి మరియు వంశీ చిత్రాల్లో ఉండే కామెడీ అంటే కూడా చాలా ఇష్టం. ఈ రెండింటినీ కలిపి ట్రై చేద్దామని చేసిన ప్రయోగమే ‘వెంకీ’ మూవీ. అది ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడంతో అక్కడి నుంచి ఎక్కువగా అదే ఫార్ములాని ఫాలో అవుతున్నానని’ ఆయన అన్నారు.

1999లో దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయమైన శ్రీను వైట్ల ఇప్పటివరకూ 12 చిత్రాలకు దర్శకత్వం వహించారు. కేవలం దర్శకుడిగానే కాకుండా ‘రెయిన్ బో’ మరియు ‘పరమవీరచక్ర’ సినిమాల్లో నటుడిగా కూడా తెరపై కనిపించారు. ప్రస్తుతం శ్రీను వైట్ల యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా ‘బాద్షా’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం 2013 సంక్రాంతికి విడుదల కానుంది. ఈ చిత్రం తర్వాత మహేష్ బాబుతో మరో సినిమా చేయడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు.

ఇంకా మరెన్నో మంచి చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించాలని కోరుకుంటూ, ఈ రోజు శ్రీను వైట్ల పుట్టిన రోజు సందర్భంగా 123తెలుగు.కామ్ తరపున ఆయనకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

సంబంధిత సమాచారం :