శంకర్ ‘ఐ’ టీజర్ – హాలీవుడ్ ను తలదన్నేలా..

శంకర్ ‘ఐ’ టీజర్ – హాలీవుడ్ ను తలదన్నేలా..

Published on Sep 16, 2014 2:09 PM IST

i-poster
తను దర్శకత్వం వహించే ప్రతి సినిమాతో భారతీయ సినిమా స్థాయిని పెంచుకుంటూ వెళ్తున్న దర్శకుడు శంకర్. ‘రోబో’తో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ టాలెంట్ ను ఇంటర్నేషనల్ లెవెల్లో చాటి చెప్పిన శంకర్… తాజాగా దర్శకత్వం వహించిన ‘ఐ’ సినిమాతో హాలీవుడ్ దర్శకనిర్మాతలకు సవాల్ విసిరేలా కనిపిస్తున్నాడు. విక్రమ్, అమీ జాక్సన్ జంటగా శంకర్ దర్శకత్వంలో 180 కోట్ల భారి బడ్జెట్ తో ఆస్కార్ రవిచంద్రన్ నిర్మించిన ‘ఐ’ ఆడియో, టీజర్ సోమవారం విడుదల చేశారు. సగటు సినిమా ప్రేక్షకుడి చేత వావ్… సింప్లీ సూపర్బ్ అనిపించింది ‘ఐ’ టీజర్.

రెండేళ్ళ కష్టం… 180 కోట్ల భారి బడ్జెట్… నిర్మాత, హీరో తనపై ఉంచిన నమ్మకం.. వన్ మినిట్ టీజర్ లో చూపించాడు శంకర్. అతని ఇమేజినేషన్ కు సెల్యూట్ చేయాల్సిందే. సినిమాలో ట్విస్టులు బాగా ఉంటాయని టీజర్ చూస్తే అర్ధం అవుతుంది. స్క్రీన్ ప్లే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయనుంది. హాలీవుడ్ స్థాయిలో ‘ఐ’ను రూపొందించాడు. స్పెషల్ ఎఫెక్ట్స్ అద్బుతంగా ఉన్నాయి.

సాధారణ మనిషి, బీస్ట్ (మృగం), అందవికారమైన ముఖం ఇలా పలు గెటప్ లలో విక్రమ్ కనిపించారు. ‘అపరిచితుడు’ తర్వాత శంకర్ దర్శకత్వంలో మరోసారి నట విశ్వరూపం చూపడానికి రెడీ అయ్యాడు. మేకప్ ఆర్టిస్టులను మెచ్చుకుని తీరాల్సిందే.

శంకర్ ఊహను పిసి శ్రీరామ్ తెరపై అందంగా ఆవిష్కరిస్తే, తన నేపధ్య సంగీతంతో ఏఅర్ రెహమాన్ ఉత్కంఠను కలిగించాడు. ఒక్క క్షణం కూడా కనురెప్ప వేయకుండా అలా టీజర్ ను చూస్తూ ఉండిపోయారు ప్రేక్షకులు. ఇండియన్ సినిమా స్థాయిని పెంచే సినిమా ‘ఐ’ అవుతుందని విమర్శకులు ప్రసంశలు కురిపిస్తున్నారు. ఈ అంచనాలను శంకర్ నిజం చేస్తాడా..? లేదా..? తెలియాలంటే సినిమా విడుదల వరకు వెయిట్ చేయాలి.

 

‘ఐ’ టీజర్ చూడడం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు