డిసెంబర్ 30న ‘ఐ’ తెలుగు ఆడియో..

డిసెంబర్ 30న ‘ఐ’ తెలుగు ఆడియో..

Published on Dec 23, 2014 3:13 PM IST

i-poster

విక్రమ్, అమీ జాక్సన్ జంటగా శంకర్ దర్శకత్వంలో ఆస్కార్ రవిచంద్రన్ నిర్మించిన విజువల్ వండర్ ‘ఐ’. ఏఅర్ రెహమాన్ సంగీత దర్శకుడు. సెప్టెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా తమిళ ఆడియో శ్రోతలను అలరిస్తుంది. తెలుగు వెర్షన్ ఆడియోను డిసెంబర్ 30న విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. తమిళ ఆడియో విడుదల కార్యక్రమానికి ఆర్నాల్డ్ ష్క్వార్జ్ నెగ్గర్, రజినీకాంత్ వంటి హేమాహేమీలు హాజరయ్యారు. విక్రమ్, అమీ జాక్సన్ లు లైవ్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. తెలుగు ఆడియోకి అతిధులుగా ఎవరిని ఆహ్వానించారో ఇంకా తెలియదు.

‘ఐ’ టీజర్, విక్రమ్ డిఫరెంట్ గెటప్స్, విజువల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. హాలీవుడ్ స్థాయిలో సినిమాను తెరకెక్కిస్తున్నారు అంటూ ప్రసంశలు లభించాయి.

మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ ప్రై.లిమిటెడ్ పతాకంపై తెలుగులో ఈ భారి బడ్జెట్ సినిమాను అనువదిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 9న సినిమాను విడుదల చేస్తున్నారు.

తాజా వార్తలు