నేనొక పెద్ద తుంటరిని – కాజల్

నేనొక పెద్ద తుంటరిని – కాజల్

Published on Jan 7, 2012 10:07 AM IST


నేనొక పెద్ద తుంటరిని అంటోంది అందాల భామ కాజల్ అగ్గార్వాల్. చిన్నతనం లో ఆమె విపరీతమైన అల్లరి చేసి స్కూల్ లో మాస్టార్లకు బాగా పని కల్పించేది అట. ఈ విషయాన్నీ స్వయం గా కాజల్ వెల్లడించింది.

“చిన్న తనం లో విపరీతం గా అల్లరి చేసేదాన్ని. స్కూల్ లో మంచి ఆకతాయి గ పేరు ఉండేది. ఎప్పుడు కుదురుగా కుర్చునేదాన్ని కాదు. అంతే కాకుండా నాటకాలు, ఆట పాట ల లో ఎప్పుడూ ముందు ఉండే దాన్ని. బహుశా సినీ పరిశ్రమ లో కి అడుగుపెట్టాలని నాకు రాసి పెట్టి ఉందేమో.”, అంటోంది ఈ అందాల భామ.

త్వరలో ప్రిన్స్ మహేష్ బాబు సరసన కాజల్ తళుక్కు మనిపించాబోతోంది. జనవరి 13 న విడుదల కాబోతున్న ‘బిజినెస్ మాన్ ‘ చిత్రం కాజల్ హీరోయిన్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు