3 ఇడియట్స్ తెలుగులో నన్ను చేయమని అడిగారు: రామ్ చరణ్

3 ఇడియట్స్ తెలుగులో నన్ను చేయమని అడిగారు: రామ్ చరణ్

Published on Jan 20, 2012 9:36 AM IST


తమిళ్లో శంకర్ రూపొందించిన ‘నన్బన్’ చిత్రాన్ని స్నేహితుడు పేరుతో డబ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర ఆడియో శిల్పకళా వేదికలో ప్రముఖుల సమక్షంలో నిన్న విడుదల చేసారు. ఈ సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ముఖ్య అతిధిగా విచ్చేసారు. ఆయన మాట్లాడుతూ నన్బన్ ఒరిజినల్ వెర్షన్ అయిన ‘3 ఇడియట్స్’ ఆ చిత్రం పూర్తయిన తరువాత విడుదలకు ముందు చిత్ర నిర్మాతలు తను ముంబై పిలిపించి ఈ చిత్రం చూపించారు.

చూసిన తరువాత ఈ చిత్రం తెలుగులో మీరు చేస్తే బావుంటందని అన్నారు. కాని అమీర్ ఖాన్ లాంటి వారు చేసిన పాత్రని నేను చేయాలంటే భయం వేసి నా వాళ్ళ కాదు అనేసాను. కాని శంకర్ లాంటి గొప్ప దర్శకుడు చేస్తున్నారు అని తెలిస్తే వెంటనే ఒప్పుకొనే వాడిని అన్నారు. అలాగే శంకర్ డైరెక్ట్ చేసిన మొదటి చిత్రం ‘జెంటిల్ మేన్’ గురించిన ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు.

నేను చిన్నగా ఉన్నప్పుడు మా తండ్రి గారైన చిరంజీవి గారికి నేను డాన్సు సరిగా చేయగలనో లేదో అనే అనుమానం ఉండేది ఆయనకు జెంటిల్ మేన్ సినిమాలోని ‘చికుబుకు చుకుబుకు రైలే’ పాటకు డాన్సు చేసి చూపించడంతో నువ్వు పెద్ద డాన్సర్ వి అవుతావని నాన్న గారు నన్ను వెంటనే గుండెలకి హత్తుకున్నారని చెప్పారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు