నెగిటివ్ రోల్లో నటించడానికి సందేహించాను – ఎన్టీఆర్

నెగిటివ్ రోల్లో నటించడానికి సందేహించాను – ఎన్టీఆర్

Published on Feb 17, 2015 1:06 PM IST

ntr-temper

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన తాజా సినిమా ‘టెంపర్’ బంపర్ కలెక్షన్స్ తో.. విడుదలైన తొలిరోజు నుండి సూపర్ హిట్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద జైత్రయాత్ర కొనసాగిస్తుంది. బహుశా, తన కెరీర్ లో ఎన్టీఆర్ మొదటిసారి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించాడు.

ఈ అంశం గురించి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. మొదట నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో నటించడానికి నేను సందేహించాను. షూటింగ్ జరిగే సమయంలో సైతం, నా క్యారెక్టర్ పై నాలో చాలా సందేహాలు వ్యక్తం అయ్యేవి. ఈ క్రెడిట్ అంతా దర్శకుడు పూరి జగన్నాధ్ కు చెందుతుంది. నాలో నమ్మకాన్ని కలిగించారు. అందరు హర్షించే విధంగా పాత్రను తీర్చిదిద్దారు. అని చెప్పారు.

పరమేశ్వరా ఆర్ట్స్ పతాకంపై బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ నిర్మించిన ఈ సినిమాకు వక్కంతం వంశి కథ అందించారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్. అనూప్ రూబెన్స్ పాటలను, మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు.

తాజా వార్తలు