నేను దేవుణ్ని కాదు.. ఓ సామాన్యుణ్ని- విజయ్

నేను దేవుణ్ని కాదు.. ఓ సామాన్యుణ్ని- విజయ్

Published on May 10, 2026 1:58 PM IST

Thalapathy-Vijay

తమిళనాడు రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా టీవీకే చీఫ్ జోసెఫ్‌ విజయ్‌ ప్రమాణ స్వీకారం చేశారు. ఇందుకు చెన్నైలోని జవహర్‌లాల్‌ నెహ్రూ ఇండోర్‌ స్టేడియం వేదికైంది. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ.. ‘తమిళనాడు ప్రజలకు నేను జవాబుదారీగా ఉంటాను. పారదర్శకమైన పరిపాలన అందిస్తాను. ముఖ్యంగా ప్రజల సొమ్మను ఒక్క పైసా కూడా నేను ముట్టుకోను. నా పై ఎంతో నమ్మకం ఉంచి, నాకు అప్పగించిన బాధ్యత విషయంలో ఏమాత్రం వమ్ము చేయను’ అని విజయ్ చెప్పుకొచ్చారు.

విజయ్ ఇంకా మాట్లాడుతూ.. ‘మా ప్రభుత్వం మహిళల భద్రతపై ఫోకస్ పెడుతుంది. డ్రగ్స్ విక్రయాలను అరికట్టడానికి, సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడుతుంది. మీరు నాకు చాలా పెద్ద బాధ్యత అప్పగించారు. కానీ నాకు కొంత సమయం ఇవ్వాలని మిమ్మల్ని కోరుతున్నాను. నేను ఎప్పటికీ తప్పు చేయను. పేదరికం, ఆకలి అంటే ఏంటో నాకు తెలుసు. నేను మీలో ఒకణ్ని. నేను సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసే వ్యక్తికి జన్మించాను. నేను దేవుణ్ని కాదు.. ఓ సామాన్యుణ్ని. కానీ మిమ్మల్ని చూస్తుంటే ఏమైనా చేయగలం అనిపిస్తోంది’ అని విజయ్ తెలిపారు.

తాజా వార్తలు