“అలా అమెరికాపురంలో” ప్రోమో ను లాంఛ్ చేయనున్న అల్లు అర్జున్!

“అలా అమెరికాపురంలో” ప్రోమో ను లాంఛ్ చేయనున్న అల్లు అర్జున్!

Published on Jul 4, 2021 11:32 AM IST

అహ ఓటిటి యాప్ అభిమానులను, ప్రేక్షకులను నిరంతరం అలరిస్తూనే ఉంది. అయితే ప్రముఖ సంగీత దర్శకుడు థమన్ తో లైవ్ కన్సర్ట్ ప్రోగ్రామ్ ను అహ మరియు హంసిని ఎంటర్టైన్మెంట్ కలిసి నిర్వహించనున్నాయి. అయితే ఈ థమన్ లైవ్ ఇన్ యూఎస్ఎ కార్యక్రమం కి అలా అమెరికాపురం లో అంటూ టైటిల్ పెట్టడం జరిగింది. అయితే ఈ కార్యక్రమం పై అభిమానులు అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ కార్యక్రమం కి సంబంధించిన ప్రోమో ను నేడు సాయంత్రం 7 గంటలకు విడుదల చేయనున్నారు. అయితే అహ యాప్ అభిమానులను నిరంతరం అలరిస్తూనే ఉంది. ఇప్పటికే ఈ శుక్రవారం 15 సినిమాలను ప్రేక్షకులకు అందించిన అహ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, లవ్ స్టోరీ, లక్ష్య సినిమాలను సైతం అందించేందుకు సిద్దం గా ఉన్నట్లు తాజాగా పేర్కొంది. అయితే అభిమానులు ఈ సినిమాల కోసం, కొత్త కార్యక్రమాల కోసం ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు