చిత్రీకరణ చివరి దశలో సుమంత్ సినిమా !

హీరో సుమంత్ తన ప్రస్తుత చిత్రం ‘ఇదం జగత్’ సినిమాను పూర్తిచేసే పనిలో ఉన్నారు. నూతన దర్శకుడు అనిల్ శ్రీకంఠం దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం యొక్క టాకీ పార్ట్ దాదాపుగా పూర్తైపోయి ఇంకొక్క పాట మాత్రం మిగిలి ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలోనే దీన్ని కూడ కంప్లీట్ చేయనున్నారు.

అంజు కురియన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో సుమంత్ కొంత నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారు. ఈ మధ్యే విడుదలై ఈ చిత్ర ప్రీ లుక్ కూడ మంచి స్పందన లభించింది. ఇకపోతే సుమంత్ నూతన దర్శకుడు సంతోష్ జాగర్లపూడి డైరెక్షన్లో ‘సుబ్రమణ్యపురం’ అనే సినిమాని ఇటీవలే ప్రారంభించారు. ధీరజ్ బొగ్గరం, సుధాకర్ రెడ్డిలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Exit mobile version