‘నీ జతగా’ ఇదే ఇదే లిరికల్ వీడియో సాంగ్ !

‘నీ జతగా’ ఇదే ఇదే లిరికల్ వీడియో సాంగ్ !

Published on Jul 7, 2019 9:10 AM IST

బి.వీర దర్శకత్వంలో సుభద్ర క్రియేషన్స్ పై రామ్.బి నిర్మించిన చిత్రం ‘నీ జతగా’. కాగా ఈ చిత్రం నుండి ఆదిత్య మ్యూజిక్ ‘ఇదే ఇదే’ సాంగ్ ను రేడియో సిటీ 91.1 ఎఫ్.ఎం ద్వారా శ్రోతలను వినిపించింది. ఈ సందర్బంగా ‘ఇదే ఇదే’ సాంగ్ ను రచించిన అనంత్ శ్రీరామ్ గారు మాట్లాడుతూ… మనిషి జీవితంలో చిన్న ప్రయాణాలు అక్కడ జరిగే సంఘటనలు మనిషి జీవుతాన్నే మార్చేస్తాయి. ప్రస్తుత జీవన గమనంలో మనిషి ప్రకృతికి చాలా దూరమైపోతున్నాడు. దాని వల్లా అనేక నష్టాలు తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ మధ్య ట్రిక్కింగ్ అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. ట్రిక్కింగ్ కారణంగా మనిషి ప్రకృతికి దగ్గరయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. ఇలా కొందరు యువతి యువకులు ట్రిక్కింగ్ వెళ్ళినప్పుడు వారి మధ్య జరిగే కొన్ని సంఘటనలు, ప్రకృతికి వీరికి మధ్య జరిగిన విషయాలు, ప్రకృతి నుండి జీవితానికి అవసరమైన విషయాలు తెలుసుకోవడం ఇలా సాగిపోయే కథనం అన్నారు.

రామ్.బి మాట్లాడుతూ… ఈ మూవీ ట్రిక్కింగ్ బేస్డ్ లవ్ స్టొరీ. 60 ఏళ్ల జీవితాన్ని మూడు రోజుల ప్రయాణంలో మనిషి చూసినప్పుడు, మనిషి అనుభూతులు, ఆ అనుభూతుల తాలూకు అంశాలు ఎంత మధురంగాను, ఎంత క్లిష్టంగాను ఉంటాయో అనే అంశాలు చాలా గొప్పగా చూపించామని , సహజంగా మాటల్లో చెప్పలేని అంశాలను భావాలను పాటల ద్వారా చెప్పే ప్రయత్నం చేసాము. పాటలన్ని ప్రజాధారణ పొందుతారని తెలిపారు.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు