‘ఇడుపు కాయితం’పై మేకర్స్ కొత్త అప్డేట్.. రిలీజ్ అప్పుడేనట..!

ప్రియదర్శి, నాగదుర్గ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ఇడుపు కాయితం’ వర్క్‌షాప్ సెషన్స్ సక్సెస్‌ఫుల్‌గా పూర్తయ్యాయి. సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ హార్ట్ టచింగ్ మూవీ ఇప్పుడు షూటింగ్‌కి సిద్ధమైంది.

ఈ చిత్రం, పక్కా లోకల్ నెటివిటీతో కూడిన ఒక స్వచ్ఛమైన గ్రామీణ కథాంశంతో ప్రేక్షకులను అలరించబోతోంది. ఇక ఈ సినిమాలో పలువురు తెలంగాణ నేపథ్యానికి సంబంధించిన యాక్టర్స్ నటిస్తుండటంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది.

తబితా సుకుమార్ సమర్పణలో బన్నీ వాస్ నిర్మాణంలో వంశీ రెడ్డి దొండపాటి తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నాడు. ఈ ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌ను ఈ ఏడాది డిసెంబర్‌లో గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

Exit mobile version