ఆ సెంటిమెంట్ కలిసొస్తే బన్నీకి మళ్ళీ ఇండస్ట్రీ హిట్టే

Published on Mar 9, 2020 1:00 pm IST

అల వైకుంఠపురంలో మూవీతో సంక్రాంతి హీరోగా భారీ హిట్ అందుకున్నాడు అల్లు అర్జున్. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం టాలీవుడ్ టాప్ 3 హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఈ సక్సెస్ తో వచ్చిన ఊపులో బన్నీ తన తదుపరి చిత్ర షూటింగ్ షెడ్యూల్ నందు పాల్గొననున్నాడు. బన్నీ 20వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీని దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో ఇది హ్యాట్రిక్ మూవీ కావడం విశేషం. కాగా అల వైకుంఠపురంలో కూడా త్రివిక్రమ్-బన్నీ కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ.

ఈ నేపథ్యంలో సెంటిమెంట్ కలిసొస్తే సుకుమార్ తో బన్నీ మరో ఇండస్ట్రీ హిట్ అందుకోవడం ఖాయం. సుకుమార్ డెబ్యూ మూవీ ఆర్య బన్నీతోనే తెరకెక్కించడం జరిగింది. ఈ చిత్రం బన్నీకి ఫస్ట్ సూపర్ హిట్ మూవీ అని చెప్పొచ్చు. ఇక దీనికి కొనసాగింపుగా ఆర్య 2 మూవీ రావడం జరిగింది. ఆ చిత్రం మిక్స్డ్ టాక్ అందుకున్నప్పటికీ మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఆర్య 2 విడుదలైన 11 ఏళ్లకు మళ్ళీ వీరు మూడో చిత్రం చేస్తున్నారు. త్రివిక్రంతో చేసిన హ్యాట్రిక్ మూవీతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న బన్నీ, సుకుమార్ తో చేస్తున్న హ్యాట్రిక్ మూవీతో కూడా ఆ రేంజ్ హిట్ అందుకుంటాడేమో చూడాలి.

సంబంధిత సమాచారం :

More