ఆ సాంగ్స్ అంత కాన్ఫిడెంట్ గా చేయలేనంటున్న చెన్నై భామ

Regina
ఎస్ ఎం ఎస్, ‘రొటీన్ లవ్ స్టొరీ’ చిత్రాలతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ముద్దుగుమ్మ రేజీనా. మొదటి రెండు సినిమాల్లోనూ తన లుక్, నటనతో ఆకట్టుకున్న రేజీనా ప్రస్తుతం తెలుగులో మూడు, తమిళంలో మూడు సినిమాలతో బిజీగా ఉంది. ఇప్పుడిప్పుడే కెరీర్లో ఎదుగుతున్న ఈ భామని మీకు అవకాశం ఇస్తే ఐటెం సాంగ్స్ చేస్తారా? అని అడిగితే ‘ మామూలుగా నేను ఐటెం సాంగ్స్ ని ఫుల్ ఎంజాయ్ చేస్తాను.ఇటీవలే వచ్చిన ‘రింగ రింగా’, ‘సక్కు భాయ్ గరం చాయ్’ మొదలైన ఫేమస్ ఐటెం సాంగ్స్ ని వింటుంటాను. కానీ ఐటెం సాంగ్స్ చేయమని ఆఫర్ మాత్రం చేయను. ఆ సాంగ్స్ చెయ్యాలంటే బాగా కాన్ఫిడెంట్ ఉండాలి కానీ నేను ఐటెం సాంగ్స్ ని కాన్ఫిడెంట్ గా చెయ్యలేను. ఒకవేళ భవిష్యత్తులో మానసికంగా ధైర్యం వస్తే చేసే అవకాశం ఉండొచ్చని’ చెప్పింది. ప్రస్తుతం నారా రోహిత్, సాయి ధర్మ తేజ్, ప్రకాశ రాజ్ లు ప్రదాన పాత్రలు పోషిస్తున్న తెలుగు సినిమాల్లో నటిస్తోంది.

Exit mobile version