ఇళయరాజాకు మళ్ళీ కోపమొచ్చింది !

Published on May 27, 2019 5:32 pm IST

ఎప్పుడూ శాంతంగా కనిపిస్తూ, అందరినీ చిరునవ్వుతోనే పలకరిస్తుంటారు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా. కానీ ఈమధ్య ఆయనకు కోపం తెప్పించే వ్యవహారాలు జరుగుతున్నాయి. గతంలో ఒకసారి తన అనుమతి లేకుండానే ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం తన పాటల్ని ప్రైవేట్ కార్యక్రమాల్లో పాడుతున్నారని, అది సరికాదని, పాటలను వాడుకుంటున్నందుకు తనకు డబ్బు చెల్లించాలని నోటీసులు కూడా పంపారాయన. అప్పటి నుండి ఎస్పీబీ ఇళయరాజా పాటల్ని ఏ ప్రైవేట్ కార్యక్రమంలోనూ ఆలపించలేదు.

ఇక తాజాగా విడుదలై సూపర్ హిట్ అనిపించుకున్న తమిళ చిత్రం ’96’లో కూడా తన పాటల్ని కొంచెం మార్పులు చేసి వాడేసుకున్నారని, అది సరైన పద్దతి కాదని మ్యూజిక్ మేస్ట్రో అభిప్రాయపడ్డారు. అలా వాడుకునే వాళ్లకు ప్రతిభ లేనట్టేనని, అది తప్పని మండిపడ్డారు. ఒక సంగీత దర్శకుడు కంపోజ్ చేసిన సంగీతాన్ని వేరొక సంగీత దర్శకుడు వాడుకుంటున్నారు. అసలు ఇప్పటి సంగీత దర్శకులు కొత్త తరహా సంగీతాన్ని ప్రేక్షకులు ఎందుకు పరిచయం చేయరు అంటూ ప్రశ్నించారు.

సంబంధిత సమాచారం :

More