“మంజుమ్మల్ బాయ్స్” యూనిట్ కి ఇళయరాజా షాక్.. కానీ

“మంజుమ్మల్ బాయ్స్” యూనిట్ కి ఇళయరాజా షాక్.. కానీ

Published on May 23, 2024 1:55 PM IST

రీసెంట్ గా మళయాళ సినిమా నుంచి భారీ హిట్ అయ్యిన పలు చిత్రాల్లో క్రేజీ సర్వైవల్ థ్రిల్లర్ చిత్రం “మంజుమ్మల్ బాయ్స్” కూడా ఒకటి. దర్శకుడు చిదంబరం ఈ సినిమాని తెరకెక్కించగా నిజ జీవితంలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా సినిమాని వారు రూపొందించారు. అయితే ఈ చిత్రంలో అందరినీ ఎంతో ఆకట్టుకున్న అంశాల్లో లెజెండరీ హీరో కమల్ హాసన్ (Kamal Haasan) క్లాసిక్ హిట్ సాంగ్స్ లో ఒకటైన కమ్మని ఈ ప్రేమ లేఖలే సాంగ్ మేజర్ ప్లస్ అయ్యింది.

అయితే ఇప్పుడు ఈ సాంగ్ విషయంలో ఆ సాంగ్ ఒరిజినల్ కంపోజర్ ఇళయరాజా గారు షాకిచ్చారు. తన అనుమతి లేకుండా ఆ పాటని ఎలా పెడతారు అని అలా పెట్టినందుకు తనకి పెనాల్టీ కట్టాలి లేదా సినిమా నుంచి పాటని తొలగించాలని చిత్ర యూనిట్ కి నోటీసులు పంపారట. దీనితో మరోసారి రాజా గారి పేరు వార్తల్లోకి వచ్చింది.

రీసెంట్ గానే సూపర్ స్టార్ రజినీకాంత్ “కూలీ” (Coolie Movie) టైటిల్ టీజర్ లో ఓ ట్రాక్ విషయంలో కూడా కేసు వేయడం తెలిసిందే. మొత్తానికి అయితే రాజా గారు తన పాటల విషయంలో ఎక్కడా తగ్గడం లేదు.. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే తాము “గుణ” సినిమా పాటలు సొంతం చేసుకున్న ఆడియో లేబుల్ వారి దగ్గర పాటకి హక్కులు కొనుకొనే మంజుమ్మల్ బాయ్స్ లో పాట పెట్టడం జరిగింది అని సో మా తప్పు ఏమీ లేదని చిత్ర యూనిట్ చెబుతున్నారట..

సంబంధిత సమాచారం

తాజా వార్తలు