రజినీ “కూలీ”.. మేకర్స్ కి షాకిచ్చిన ఇళయరాజా

రజినీ “కూలీ”.. మేకర్స్ కి షాకిచ్చిన ఇళయరాజా

Published on May 1, 2024 7:00 PM IST

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ఇప్పుడు పలు చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాల్లో స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో చేస్తున్న చిత్రం “కూలీ” కూడా ఒకటి. మరి రీసెంట్ గానే ఈ సినిమా నుంచి రీసెంట్ గానే మేకర్స్ టైటిల్ టీజర్ ని రిలీజ్ చేయగా ఇది ఫ్యాన్స్ కి ఓ రేంజ్ లో ఎక్కేసింది. అయితే ఈ టీజర్ లో అనిరుద్ ఇచ్చిన స్కోర్ కి మొదట్లో యావరేజ్ రెస్పాన్స్ నే వచ్చింది కానీ తర్వాత ఎప్పటిలానే హిట్ అయ్యింది.

అయితే ఈ టీజర్ చూసాక తలైవర్ ఫ్యాన్స్ కి తన వింటేజ్ చిత్రం 1983లో వచ్చిన “తంగ మగన్” (Thanga Magan) లోని వా వా పక్కం వా (Va Va Pakkam Vaa) సాంగ్ లో ట్యూన్ వెంటనే స్ట్రైక్ అయ్యింది. దీనితో ఇదే ఇప్పుడు కూలీ మేకర్స్ కి షాకిచ్చింది. “తంగ మగన్” లో ఒరిజినల్ ట్యూన్ ని స్వరపరిచిన సంగీత దర్శకులు లెజెండరీ ఇళయరాజా ఇపుడు కూలీ మేకర్స్ పై కేసు వేసినట్టుగా తెలుస్తుంది.

తాను కంపోజ్ చేసిన ట్యూన్ ని తన అనుమతి లేకుండా ఎలా వాడుకుంటారు అని ఆయన కేసులోని సారాంశం అట. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా ఆ తంగ మగన్ సినిమాలో కూడా రజినీకాంత్ నే హీరో కావడం విశేషం. మాములుగా గతంలో కూడా లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) తన సినిమాల్లో కొన్ని పాత సినిమాల పాటలు వినియోగించడం చూసాం.

మరి వాటిలో కూడా రాజాగారి ట్యూన్స్ ఉన్నాయట. తాను ప్రొడ్యూస్ చేసిన సినిమా “ఫైట్ క్లబ్” అలాగే “విక్రమ్” లోని టైటిల్ ట్రాక్ లలో కూడా రాజాగారి ట్యూన్స్ ఉన్నాయి. మొత్తానికి కూలీ విషయంలో తాను కేసు వేశారు. మరి చూడాలి మేకర్స్ ఎలాంటి వివరణ అందిస్తారో అనేది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు