శంకర్‌కు లీగల్ నోటీసు పంపిన ఇళయరాజా.

శంకర్‌కు లీగల్ నోటీసు పంపిన ఇళయరాజా.

Published on Jan 3, 2015 3:21 PM IST

Ilayaraja

ప్రముఖ దర్శకుడు శంకర్‌కు సంగీత దర్శకుడు ఇళయరాజా లీగల్ నోటీసు పంపారు. వైభవ్ హీరోగా నటించిన ‘కప్పల్’ సినిమాను ఎస్ పిక్చర్స్ పతాకంపై శంకర్ నిర్మించారు. ఈ సినిమాలో ‘కరకటకరణ్’ అనే తమిళ సినిమా కోసం ఇళయరాజా స్వరపరిచిన ‘ఊరు వీటు ఊరు వందు’ అనే పాటను రీమిక్స్ చేశారు.

తన అనుమతి లేకుండా పాటను రీమిక్స్ చేసి వాడుకున్నారని ఇళయరాజా లీగల్ నోటీసు పంపారు. ఇందుకు గాను తగిన పరిహారం ఇవ్వాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. సినిమాలో పాటను తొలగించాలని, లేకుంటే కేసు నమోదు చేస్తానని హెచ్చరించారు. దీనికి శంకర్ ఎటువంటి జవాబు ఇస్తారో చూడాలి.

డిసెంబర్ 25న విడుదలైన ‘కప్పల్’ సినిమా మల్టీప్లెక్స్ థియేటర్లలో మంచి స్పందనను సొంతం చేసుకుంది. సోలో హీరోగా వైభవ్ కు మంచి హిట్ అందించింది.

తాజా వార్తలు