
సౌత్ ఇండియన్ మోస్ట్ ఫేమస్ మ్యూజిక్ కంపోజర్ ఎంఎస్ విశ్వనాథన్ ఇటీవలే స్వర్గస్తులైనారు. ఈ విషయం తమిళ చిత్ర సీమని ఎంతో శోఖానికి గురిచేసింది. తాజాగా మాస్ట్రో ఇళయరాజా ఎంఎస్ విశ్వనాథన్ కి ఓ స్పెషల్ మ్యూజికల్ ట్రిబ్యూట్ ఇవ్వనున్నారు. ఆయన ఆర్కెస్ట్రా మరియు టీంతో కలిసి ఇళయరాజా ఎంఎస్ విశ్వనాథన్ గారి సూపర్ హిట్ సాంగ్స్ పై పెర్ఫార్మన్స్ ఇవ్వనున్నాడు.
ఈ స్పెషల్ ట్రిబ్యూట్ విశేషాల గురించి ఇళయరాజా మాట్లాడుతూ ‘విశ్వనాథన్ గారి మ్యూజికల్ నాలెడ్జ్, ఆయన స్కిల్స్ మరియు మ్యూజిక్ మీద ఆయనకు ఉన్న కమాండ్ గురించి అందరికీ తెలిసిందే. అయన మ్యూజిక్ గురించి నాకన్నా ఎవరికీ ఎక్కువ తెలియదు. ఆయన వారసత్వాన్ని హైలైట్ చేసేలా నా మ్యూజికల్ ట్రిబ్యూట్ ఉంటుందని’ తెలిపాడు. విశ్వనాథన్ చివరి స్టేజ్ లో ఉన్నప్పుడు ఇళయరాజా ఆయన్ని హాస్పిటల్ లో హాస్పిటల్ లో కలిసి ‘విశ్వనాథన్ గారు చనిపోవచ్చు, కానీ ఆయన పేరు మాత్రం ఎప్పటికీ చనిపోదని’ తెలిపాడు. జీవ – ఇళయరాజా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వారు జూలై 27న ఈ మ్యూజికల్ నైట్ ని ఆర్గనైజ్ చేయనున్నారు.

