చిరుకు జోడీగా ఎవర్ని అనుకుంటున్నారో తెలిస్తే షాకవుతారు

చిరుకు జోడీగా ఎవర్ని అనుకుంటున్నారో తెలిస్తే షాకవుతారు

Published on Sep 4, 2019 8:37 PM IST

‘సైరా’ సెట్స్ మీద ఉండగానే కొరటాల శివ చిరుతో చేయాల్సిన తన సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్ని స్టార్ట్ చేసేశారు. ఇప్పటికే కథ సెట్ అవ్వగా ఇప్పుడు నటీనటుల ఎంపిక జరుగుతోంది. ముఖ్యంగా చిరు సరసన హీరోయిన్ ఎవరనే విషయమై ప్రధాన చర్చ నడుస్తోంది. ముందుగా నయనతారను టీసుకొవలని అనుకున్న కొరటాల శివ ‘సైరా’లో కూడా ఆమే హీరోయిన్ కాబట్టి మారిస్తే బాగుంటుందని వేరొకరి కోసం చూస్తున్నారట.

అందులో భాగంగానే గోవా బ్యూటీ ఇలియానాను తీసుకోవాలని అనుకుంటున్నారని ఫిల్మ్ నగర్ టాక్. ఈ వార్త అందరికీ కాస్త షాకిచ్చినా వయసు రీత్యా ఇద్దరిదీ మంచి జోడీ అవుతుందని పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు. మరి ప్రస్తుతానికి ఒక బజ్ మాత్రమే ఈ వార్త నిజమవుతుందేమో చూడాలి. ఇకపోతే వరుస విజయాలతో స్టార్ డైరెక్టర్ హోదాను అనతి కాలంలోనే అందుకున్న కొరటాల తొలిసారి మెగా కాంపౌండ్లో అది కూడా మెగాస్టార్ చిరుతో సినిమా చేస్తుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు