తన కోరికను బయటపెట్టినా ఇలియానా బాయ్ ఫ్రెండ్ !

Published on Aug 1, 2018 9:42 am IST

రామ్ సరసన దేవదాసు చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన ఇలియానా ఎట్టకేలకు మళ్ళీ రవితేజ్ ‘అమర్ అక్బర్ ఆంటోని’ చిత్రంతో తెలుగులో రీఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆమె గత కొన్ని సంవత్సరాలుగా ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ ఆండ్రూ కనీబోనేతో ప్రేమలో ఉందని, వారిద్దరికీ ఇప్పటికే నిశ్చితార్ధం కూడా అయిందని సోషల్ మీడియాలో వార్తలు తెగ హల్ చల్ చేశాయి. ఇలియానా మాత్రం ప్రస్తుతం రవితేజ్ సినిమాతో బిజీగా ఉంది.

కాగా ఆండ్రూ కనీబోనే ఇటీవలే ప్రముఖ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇలియానా తన అభిమాన భారతీయ నటి అని తెలిపారు. ఆ సందర్భంలో నటిగా ఇలియానా ఫాలోయింగ్ చూస్తున్నారుగా మరి మీకు కూడా యాక్టర్ అవ్వాలని అనిపించలేదా అని అడగగా.. ఆండ్రూ మాట్లాడుతూ తనకు బాలీవుడ్ సినిమాల్లో విలన్ గా నటించాలని ఉందని. లేదా ఓ ముఖ్యమైన పాత్రలోనైనా కనిపించాలని ఉందని ఆండ్రూ చెప్పుకొచ్చారు. మరి తన బాయ్ ఫ్రెండ్ కోరిక కోసం ఇలియానా దర్శక నిర్మాతలను ఛాన్స్ లు అడుగుతుందేమో చూడాలి.

సంబంధిత సమాచారం :

X
More