
అక్కినేని ఫ్యామిలీ హీరోస్ అయిన అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ ‘మనం’. ఇప్పటికే మార్కెట్లో విడుదలైన ‘మనం’ సాంగ్స్ సూపర్ హిట్ అయ్యింది. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా మే 23న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగ చైతన్యని ఎఎన్ఆర్, నాగార్జునలలో ఎవరితో పనిచేయడం ఈజీగా ఉంటుంది అలాగే వారిద్దరిలో ఎవరంటే మీకు ఎక్కువ ఇష్టం అని అడిగితే ‘నాన్నతో పనిచేయడమే నాకు ఈజీగా అనిపిస్తుంది ఆయన నన్నో క్లోజ్ ఫ్రెండ్ గా ట్రీట్ చేస్తాడు. అదే తాత అయితే లెజెండ్ యాక్టర్. తాతని చూసి నేను నేర్చుకునేవాణ్ణి. ఇక ఇద్దరిలో ఎవరు ఎక్కువ ఇష్టం అంటే నాకు తెలిసి నాన్న కంటే తాతంటేనే ఎక్కువ ఇష్టం. మేము ఇద్దరం చాలా విషయాలను షేర్ చేసుకునే వాళ్ళం. ఆయన ఏ విషయమైనా త్వరగా అప్రొచ్ అవుతారు అలాగే కొత్త ఐడియాలను ప్రోత్సహిస్తాడని’ సమాధానం ఇచ్చాడు.
సమంత, శ్రియ సరన్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి విక్రమ్ కుమార్ డైరెక్టర్. అనూప్ రూబెన్స్ సగీతం అందించిన ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మించారు.

